telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆదిపురుష్ : రాముడి పాత్ర కోసం ప్రభాస్ ప్రిపరేషన్ ఎప్పుడంటే ?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. అందుకు సంబంధించి ప్రభాస్ ఆల్రెడీ ప్లాన్డ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. రాధే శ్యామ్ అయ్యిపోయిన వెంటనే ఆ సినిమాకు కావాల్సిన బాడీ లుక్ ను ప్రభాస్ ప్రిపేర్ చెయ్యనున్నాడట. అందుకు గాను ఒకటిన్నర నెల సమయం అలా కేటాయించుకోనున్నట్టు తెలుస్తుంది. అప్పటికి ఓంరౌత్ అడిగిన లుక్ అండ్ షేప్ ను ప్రభాస్ రెడీ చేసి అప్పుడు షూటింగ్ లోకి దిగనున్నాడట. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో 500 కోట్లకు పైగా వ్యయంతో 3డి లో నిర్మించనున్నారు. కాగా ప్రభాస్ హీరోగా ఇప్పుడు మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న అద్భుతమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్” చిత్రం తాలూకా షూట్ అంతిమ దశకు చేరుకుంది. తాజాగా ఇటలీలో చివరి షెడ్యూల్ ను పూర్తి చేశారు చిత్రబృందం.

Related posts