telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెగల్‌ రేపుతున్న జల జల జలపాతం వీడియో సాంగ్‌

భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఉప్పెనా. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ల తొలి పరిచయం అయినప్పటికీ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచానాలు నెలకొన్నాయి. ఈ సినిమా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేసాడు. హీరోయిన్ కృతికి కూడా ఇదే తొలి సినిమా. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 12న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. అయితే  తాజాగా ఈ సినిమాలోని జల జల జలపాతం అనే రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది. ఈ సినిమాకు ఆ సాంగ్‌ ఎంత హైప్‌ క్రియేట్‌ చేసిందో చెప్పనక్కర్లేదు. తాజాగా ఆ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేయగా.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

Related posts