telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

జెట్ ఉద్యోగుల సమ్మె వాయిదా.. తాత్కాలికంగా ..

50 percent offer in tickets by jet air ways

నేటి నుంచి ఉద్యోగులు తలపెట్టిన నిరవధిక సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చెప్పాలనుకున్న, అయితే ఆఖరి క్షణంలో చర్చలతో సంస్థకు మరో అవకాశం ఇస్తూ, సమ్మె విరమించారు.. దీనితో జెట్ ఎయిర్ వేస్ కు ఊరట లభించింది. తమ ‘నో పే నో వర్క్’ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నామని లైలట్స్ బాడీ నేషనల్ ఏవియేటర్ గిల్డ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మూడు నెలలుగా వేతనాలు లేవని, అయినప్పటికీ, సంస్థ యాజమాన్యానికి మరికొంత సమయం ఇవ్వాలన్న నిర్ణయంతోనే సమ్మె వాయిదాకు అంగీకరించామని గిల్డ్ ప్రతినిధులు తెలిపారు. కాగా, జెట్ ఎయిర్ వేస్, ఎస్బీఐ మధ్య నేడు కీలక సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ సమావేశంలో సంస్థ తిరిగి కోలుకునేలా కీలక నిర్ణయాలు వెలువడతాయన్న అంచనాల నేపథ్యంలో, మరో అవకాశం ఇవ్వాలన్న సీనియర్ ఉద్యోగుల సూచనలతో ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Related posts