రాష్ట్రప్రభుత్వం అమరావతిలో రూ.2,046 కోట్ల పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలను పంపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ తెలిపారు. లోక్‌సభలో తెదేపాపా నేత గల్లా జయదేవ్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు చెప్పారు.
మరో రూ.500 కోట్లు రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందని, మిగిలిన ఆర్థిక వనరులను స్మార్ట్ సిటీ స్పెషల్ పర్పస్ వెహికిల్ సమకూర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకూ 3 విడతల్లో రూ.390 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. 98 శాతానికిపైగా నిధులను వినియోగించినట్లు చెప్పారు.