telugu navyamedia
సినిమా వార్తలు

కంగనా రనౌత్ దేశద్రోహి..

వివాదాస్పద హీరోయిన్‌ కంగనా రనౌత్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారింది . ఆమె చేసిన వ్యాఖ్యలపై ప‌లువురు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు ..అది “భిక్ష” అని, నిజమైన స్వాతంత్ర్యం కాదని నటి కంగనా రనౌత్ చేసిన అవమానకరమైన ప్రకటనను చేయ‌డంతో తీవ్ర దూమ‌రం రేగుతుంది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Kangana Ranaut Lands Herself in New Controversy Over Bheekh Comment, AAP  Seeks Police Case

అయితే కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈరోజు ముంబై పోలీసులకు దరఖాస్తు చేసింది. ఆప్ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రీతీ శర్మ మీనన్ వ్యాఖ్యలను “దేశద్రోహి అన్నారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 504, 505 మరియు 124A ప్రకారం, ఆమె “విద్రోహ అనుచిత‌ ప్రకటనల” కోసం రనౌత్‌పై చర్య తీసుకోవాలని అభ్యర్థించుతూ ముంబై పోలీసులకు ఒక దరఖాస్తును సమర్పించినట్లు Ms మీనన్ మరో ట్వీట్‌లో తెలిపారు.

Seditious, inflammatory statements': AAP seeks police case against Kangana  Ranaut | DH Latest News, DH NEWS, Entertainment DH, Celebrities DH, Latest  News, India, NEWS, celebrities, Entertainment , india, Freedom, Varun  Gandhi, Mumbai

అంతకుముందు రోజు, బిజెపి లోక్‌సభ సభ్యుడు వరుణ్ గాంధీ కూడా రనౌత్ వ్యాఖ్యలకు దూషించారు. పిచ్చా లేక దేశద్రోహమా అంటూ సోషల్‌ మీడియా వేదిక‌గా విరుచుకు ప‌డ్డారు. నిన్న మొన్నటిదాకా జాతిపిత మ‌హాత్మాగాంధీ త్యాగాల‌ను అవ‌మానించడమే కాకుండా, గాంధీజీని హత్యచేసిన గాడ్సేను పొగిడారు. ఇపుడు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు మంగ‌ళ్ పాండే, రాణి ల‌క్ష్మీభాయి, భ‌గ‌త్ సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ లాంటి లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అగౌర‌వ పర్చడం స‌రికాదని ..నేను అలాంటి ఆలోచనను పిచ్చి లేదా రాజద్రోహం అని పిలుస్తానా? వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

కాగా..ఈ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ, తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశ్యం లేదని, అయితే తనకు చాలా అవగాహన ఉందని, కళాకారిణిగా, జాతీయవాదిగా భారత స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడతానని అన్నారు.

Related posts