telugu navyamedia
రాజకీయ

మహిళా పోలీస్‌ అధికారిపై ప్రశంసలు..

చెన్నైలోని గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి ఎద్దడిని జ‌నం అత‌లాకుత‌లం అవుతున్నారు. ఈ క్ర‌మంలో ప్రభుత్వ, మునిసిపల్ సిబ్బంది సహాయక చర్యల చేపట్టారు. నీటితో నిండిన కిల్‌పాక్ శ్మశానవాటికలో రెస్క్యూ వర్క్‌ను శ్రీమతి రాజేశ్వరి పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్ర‌మంలో శ్మశానవాటిక దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని చెన్నైలోని TP చత్రం పోలీస్ స్టేషన్‌కు చెందిన రాజేశ్వరి అనే మహిళ పోలీసు అధికారి తన భుజాలపై మోసుకుని, ఆపై అతనిని త్వరగా వైద్యం అందించేందుకు ఆటోలోని సమీపంలో ఉన్న‌ ఆసుపత్రికి పంపించింది. 

ఉదయకుమార్ (28) అనే వ్యక్తి శ్మశానవాటికలో పనిచేస్తుంటాడు. ఈ వీడియో ఉదయం నుండి సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో ఆమె అంద‌రికీ ఆదర్శంగా నిలిచారు. రాజేశ్వరి సమయస్ఫూర్తితో వ్యవహరించినందుకు నెటిజ‌న్లు ప్రశంసలు వ‌ర్షం కురిపిస్తున్నారు

Inspector Rajeshwari rescues unconscious man in Chennai rains by carrying  him i- heartwarming videos - Tamil News - IndiaGlitz.com

దీనిపై రాజేశ్వరి అనే మహిళ పోలీసు అధికారి ఓ మీడియాతో మాట్లాడుతూ..“టిపి చత్రం ప్రాంతంలోని స్మశానవాటికలో ఒక వ్యక్తి చనిపోయాడని మాకు కాల్ వచ్చింది. శ్మశానవాటికకు వెళ్ళే స‌రికి తాళం వేశారు. ఆ వ్యక్తి మద్యం సేవించి నిన్న సాయంత్రం నుంచి అక్కడే పడి ఉన్నాడు. కాని నేను అక్కడికి చేరుకున్న వెంటనే అతను చనిపోలేదని నేను గుర్తించి వెంటనే అతన్ని ఆటో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లమని అడిగాను. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.

Related posts