పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సువెందు అధికారి ఉన్నారు. ఈ ప్రాంతంపై పూర్తి పట్టున్న నేతగా ఆయనకు పేరు ఉన్నది. అయితే, ఈ స్థానం నుంచే అధికారి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. మమత ఈ స్థానం నుంచి పోటీ చేయడం అధికారి కూడా ఇక్కడి నుంచే బరిలో ఉండటంతో ఈ నియోజక వర్గంపైనే అందరి దృష్టి పడింది. కాగా, ఈరోజు మమత నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నందిగ్రామ్ లోని గ్రామాలకు వెళ్లారు. రియాపాడ గ్రామంలోని శివాలయం నుంచి బయటకు వస్తుండగా ఆమెపై నలుగురైదుగురు వ్యక్తులు దాడులు చేశారని మమత ఆరోపించారు. ఈ దాడిలో మమతకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమె తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని కోల్ కతా వెళ్లారు. తన పర్యటన సమయంలో అక్కడ ఒక్క పోలీస్ కూడా లేరని మమతా పేర్కొన్నారు. రియపాడ వంటి ఓ చిన్న గ్రామంలో మమతా పర్యటిస్తున్న సమయంలో ఇరుకైన వీధుల్లో నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
previous post
next post
కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: జీవన్‌రెడ్డి