telugu navyamedia
రాజకీయ వార్తలు

లడఖ్ ప్రజల కోరికను మోదీ నెరవేర్చారు: అమిత్ షా

amith shah bjp

కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటూ ఎంతో కాలంగా లడఖ్ ప్రజలు చేస్తున్న డిమాండ్ ను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ పీవోకే, అక్సాయ్ చిన్ రెండూ జమ్ముకశ్మీర్ లో అంతర్భాగాలేనని అన్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు చైనా ఆధీనంలో ఉన్న అక్సాయ్ చిన్ కూడా మనదేనని అన్నారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. జమ్ముకశ్మీర్ బిల్లు కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాస్తుందనే విపక్ష నేతల వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

Related posts