telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఈ ఐస్ క్రీం .. 52వేలట.. తినడానికో.. చూసుకోడానికో మరి..

black diamond ice cream cost 52300

దుబాయ్ లోని జుమెయిరా బీచ్ రోడ్‌లో ఉన్న స్కూపీ కెఫేలో ఓ ఐస్ క్రీంను లాంచ్ చేశారు. బ్లాక్ డైమండ్‌గా పిలిచే ఈ ఐస్ క్రీంప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా వార్తల్లో నిలిచింది. 2,999 ధిరాంలు అంటే మన కరెన్సీలో దాదాపు 52,300 రూపాయలతో కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీంగా వైరల్ అయింది. చూడటానకి బంగారు వర్ణంలో మెరిసిపోతున్నప్పటికీ.. దీనికి బ్లాక్ డైమండ్‌గా నామకరణం చేశారు. దీని ప్రత్యేకత గురించి చెప్పుకుంటే, దీన్ని లిక్విడ్ నైట్రోజెన్‌తో తయారు చేస్తారు. అలాగే 23 క్యారట్ల బంగారాన్ని పొడి చేసి ఇందులో కలుపుతారు.

మామూలు ఐస్ క్రీంలలా ఫ్రీజర్‌లో పెట్టి, అవసరం అయినప్పుడు అమ్మడం కాకుండా, ఎప్పటికప్పుడు తాజాగా దీన్ని తయారు చేసి ఇస్తారు. మడగాస్కర్ వనీలా ఫ్లేవర్‌ను ఇందులో వాడుతుండగా , ఇరాన్ నుంచి తెప్పించిన అత్యంత ఖరీదైన కుంకుమపువ్వును కూడా అదనపు ఫ్లేవర్ కోసం వినియోగిస్తున్నారు. వెర్సేస్ నుంచి వచ్చిన హ్యాండ్ మేడ్ బౌల్, వెండి స్పూన్‌తో దీన్ని సర్వ్ చేస్తారు. ఈ ఐస్ క్రీంని తిన్నాక ఈ బౌల్, స్పూన్లని మీతో పాటు తీసుకువెళ్లవచ్చట. మరి మీరు కూడా ఐస్ క్రీం ప్రియులైతే, దుబాయ్ వెళ్లినప్పడు ఈ బ్లాక్ డైమండ్‌ని ఓ పట్టుపట్టండి.

Related posts