telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆన్లైన్ ప్రేయసి… 3 వేల కిలోమీటర్లు దాటొచ్చిన వ్యక్తికి షాక్

Crime

లూసియానాలోని బేయిలీ స్ట్రీట్, కాల్హౌన్ ప్రాంతానికి చెందిన జేమ్స్ ఈటన్(48) ఆన్‌లైన్‌లో రోస్ విలియమ్స్ అని మహిళ పేరు పెట్టుకొని ఓ వ్యక్తితో చాటింగ్ చేస్తున్నాడు. ఆ విషయం తెలియని బాధిత వ్యక్తి తనతో చాట్ చేస్తుంది మహిళనే అనుకొని తన పర్సనల్ విషయాలన్నీ అతడితో పంచుకున్నాడు. వ్యక్తి గురించి మొత్తం తెలుసుకున్న ఈటన్.. అతడ్ని తనదైన మాటలతో మైమరిపించి భారీగానే దండుకున్నాడు. ఈ క్రమంలో తాను చాట్ చేస్తున్న మహిళ తన మనసుకు చాలా దగ్గరైందని ఆమెను పెళ్లి చేసుకుంటే ఇద్దరం బాగా ఉండొచ్చని భావించాడు బాధిత వ్యక్తి. అనుకున్నదే తడవుగా కాలిఫోర్నియా నుంచి లూసియానాకు సుమారు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆమె ఉంటున్న ప్రాంతానికి వచ్చాడు. వారిద్దరు చాటింగ్ చేసుకున్న సమయంలో ఇచ్చిన అడ్రస్ చేత పట్టుకొని ఇంటి యజమానికి వెళ్లి రోస్ విలియమ్స్ కావాలని అడిగాడు. దాంతో ఇంటి ఓనర్ ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరని చెప్పాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటుంది జేమ్స్ ఈటన్ అనే వ్యక్తి మాత్రమేనని తెలిపాడు. ఆ మాట విన్న వ్యక్తి నిర్ఘాంతపోయాడు. తాను ఇన్నాళ్లు చాటింగ్ చేసింది మహిళ కాదా? మగవాడితోనా? అని షాక్ అయ్యాడు. వెంటనే తనకు జరిగిన అన్యాయం గురించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్ద నుంచి 1000 డాలర్ల నగదు, గిఫ్టుల రూపంలో భారీగా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు జేమ్స్ ఈటన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు ఈటన్. దాంతో ఈటన్‌పై ద్రవ్య పరికర దుర్వినియోగం, దొంగతనం కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Related posts