వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన ఓ మహిళ (23)కు ఐదేళ్ల బాబు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. నాలుగు నెలల క్రితం భర్త తరచూ వేధిస్తుండడంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది.ఈ క్రమంలో ఫేస్‌బుక్ ద్వారా ఆఫన్ అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఆఫన్ జవహర్‌నగర్‌లో ఉంటూ కుక్‌గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో బాధిత మహిళకు జవహర్‌నగర్‌లో ఓ ఇంటిలో పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో ఆమెను కలుసుకున్న నిందితుడు పెళ్లి చేసుకుంటానని, ఆమె పిల్లలకు తండ్రిగా ఉంటానని నమ్మించాడు. అప్పటినుంచి నుంచి ఆమె పనిచేస్తున్న ఇంటికి తరచూ వచ్చేవాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని మందలించారు. దీంతో ఆమెను పెళ్లాడతానని వారికి మాటిచ్చాడు. అనంతరం అటువైపు రావడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ నిందుతున్నిచేసి రిమాండుకు తరలించారు.