telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR Counter pawan comments

ఏపీ సీఎం చంద్రబాబు పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సోమవారం పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తన దగ్గర పనిచేసిన కేసీఆర్ అంటూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని అని మండిపడ్డారు. అయినా మంత్రులేమీ ముఖ్యమంత్రులకు బానిసలు కారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేయలేదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని తానే స్థాపించినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు పచ్చి అవకాశవాదిలా మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అవకాశం వస్తే మళ్లీ మోదీ సర్కారులో చేరతారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ పై బాబు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు. తమకు మహారాష్ట్ర ఎన్నికలపై ఎంత ఆసక్తి ఉంటుందో ఏపీలో ఎన్నికలపైనా అంతే ఆసక్తి ఉంటుందన్నారు. అంతమాత్రాన తామేదో జోక్యం చేసుకుంటున్నామని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును ఈ ఎన్నికల ద్వారా ఇంటికి పంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు.

Related posts