telugu navyamedia
రాజకీయ వార్తలు

బిల్లును వ్యతిరేకిస్తున్నా..సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: ఎంపీ అసదుద్దీన్

Asaduddin mim

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై మండిపడ్డారు. లోక్ సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని అన్నారు. భారత్ కూడా చైనాలా మారుతోందని విమర్శించారు. దేశంలో పరిపాలన నాజీలను తలపిస్తోందని, నాజీ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ను పాలస్తీనాలా తయారు చేస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts