ఈ మధ్యకాలంలో హత్యలు, రేప్‌లు బాగా పోరిగిపోయాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు మన హైదరాబాద్‌లోనే ఎక్కువగా చూస్తుంటాం. ఇటీవలే జరిగిన ఘటకేసర్ ఘటనలో ఓ మహిళే… ఆటో డ్రైవర్లను రేప్ కేసులో ఇరికిచింది. అయితే…చాకచక్యంతో పోలీసులు కేసును ఛేదించి… మహిళ చేసిన ఘనకార్యాన్ని బట్టబయలు చేశారు. అయితే.. ఈ ఘటన మరువక ముందే.. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకు పై తల్లి దాష్టీకానికి తెగబడింది. బ్లేడ్ తో కొడుకుపై దాడి చేసింది ఓ తల్లి. రెండు కాళ్లకు, తొడ భాగంలో బ్లేడ్ తో విచక్షణారహితంగా గాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలో బాలుడు అరుపులు కేకలు పెట్టాడు. ఆ అరుపులు విన్న కాలనీ వాసులు… హుటాహుటిన అక్కడికి చేరుకొని తల్లిని అడ్డగించారు. అప్పటికే తీవ్రగాయాల పాలైన బాలుడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే.. మద్యం మత్తులో తన కొడుకుపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.