పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇందులోభాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ని వైసీపీ ఎంపీలు కలిశారు. కృష్ణాపురం ఉల్లిని ఎగుమతికి అనుమతించాలని వినతిపత్రమిచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గోయల్‌ను కలిశామని మిథున్‌రెడ్డి చెప్పారు. గోయల్‌ని కలిసిన వారిలో మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, రెడ్డప్ప రంగయ్య ఉన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరామని చెప్పారు. గతేడాది నవంబరు నుంచి ఎగుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి అనుమతించాలని సీఎం కూడా లేఖ రాశారని అవినాష్ రెడ్డి వెల్లడించారు. తమ వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఎగుమతికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నించారు: కృష్ణంరాజు