telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బుర్జ్ ఖలీఫా పై విక్రాంత్ రోనా…

కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఫాంటమ్’. అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత యేడాది మార్చి1 హైదరాబాద్ లో మొదలైంది. కరోనా కారణంగా కొంతకాలం షూటింగ్ ను ఆపేసిన చిత్ర బృందం… అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ తిరిగి జులై 16న హైదరాబాద్ లోనే మలి షెడ్యూల్ ను జరిపింది. ఓ రకంగా కరోనా సమయంలోనూ షూటింగ్ జరిపి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు కిచ్చా సుదీప్. ఇక ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం ఫిల్మ్ సిటీలోనూ, అన్నపూర్ణ స్టూడియోలోనూ జరిగింది. ఆ తర్వాత కేరళ, మహారాష్ట్రలలోని పలు ప్రదేశాలలో చిత్రీకరణ జరిపారు. తాజా ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. అయితే కిచ్చా సుదీప్ సినీ ప్రయాణాన్ని ప్రారంభించి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ రోజు వరల్డ్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా టవర్స్ లో ఈ మూవీ టైటిల్ లోగోను, స్నీక్ పీక్ ను విడుదల చేసింది మూవీ టీమ్. అయితే ఈ సినిమాలో సుదీప్ అండర్ వరల్డ్ డాన్ పాత్ర లో కనిపించనున్నాడు. విశేషం ఏమంటే… ఇంతకాలం ‘ఫాంటమ్’గా ఉన్న పేరును ‘విక్రాంత్ రోనా’గా మార్చామని, ఇది సుదీప్ పోషిస్తున్న అండర్ వరల్డ్ డాన్ పాత్ర పేరని నిర్మాత జాక్ మంజు తెలిపారు!

Related posts