telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేవుడి బదులు సల్మాన్ ను పూజిస్తానంటున్న నటి… ఎందుకంటే ?

Salman

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరో సామాజిక అంశాలపై కూడా బాధ్యతగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ లో ఎవరికైనా ఆరోగ్యం బాలేదని, వైద్యం చేయించుకునేంత ఆర్ధిక స్థోమత లేదని తన దృష్టి వరకూ వస్తే తప్పకుండా వారికి అండగా నిలుస్తాడు భాయి జాన్. ఇలా ఇప్పటికే ఎంతోమందికి సాయం చేశాడు సల్మాన్. కాగా సల్మాన్‌ఖాన్‌తో పాటు ‘వీర్‌గతి’లో నటించిన చుంకీ పూజా డడ్వాల్ మృత్యువు అంచుల వరకూ వెళ్లి తిరిగి వచ్చింది. ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి నటించేందుకు సిద్ధమయ్యింది. గత ఏడాది పూజా టీబీ వ్యాధి బారిన పడింది. ఆ సమయంలో వైద్య చికిత్స చేయించుకునేందుకు ఆమె దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇటువంటి పరిస్థితిలో ఆమె ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. అప్పుడు సల్మాన్ ఆర్థికంగా ఆదుకోవడంతో ఆమె సకాలంలో వైద్య చికిత్స అందుకోగలిగింది. తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత వివరాలను మీడియాతో పంచుకుంది. తనకు మొదట్లో టీబీ సోకిందని తెలియలేదని, అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా సహాయం అందలేని పేర్కొంది. అనారోగ్యం కారణంగా బలహీనపడిపోయానని, ఆ సమయంలో రాజేంద్ర సింగ్ అనే డైరెక్టర్ సహాయంతో ముంబై వెళ్లి అక్కడి ఆసుపత్రిలో చేరానని తెలిపింది. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో హీరో సల్మాన్ ఖాన్ తనకు మెరుగైన వైద్యం అందేందుకు ఆర్థిక సహాయం చేశారని తెలిపింది. సల్మాన్ టీమ్ తనతో పాటు 24 గంటలూ ఉండి సంరక్షించారని పేర్కొంది. ఇప్పుడు ఆరోగ్యం సంపూర్ణంగా కుదుటపడటంతో తిరిగి నటన ప్రారంభిస్తానని తెలిపింది. భవిష్యత్‌లో కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటానని, అప్పుడు ఆ ఇంటిలో భగవంతుని ఫొటో బదులు సల్మాన్ ఫొటో పెట్టుకుని పూజిస్తానని పేర్కొంది. సల్మాన్ తనకు ఊపిరిపోసిన దేవుడు అని తెలిపింది.

Related posts