తెలంగాణలో 2019-20 విద్యాసంవత్సరానికి గాను ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడగించినట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా సమన్వయాధికారి ప్రభాకర్‌రెడ్డిలు తెలిపారు. అపరాద రుసుము చెల్లించి ఈ నెల 17వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చని వారు వెల్లడించారు.
అభ్యర్థులు ఆధార్‌కార్డు జిరాక్స్‌ను వెంట బెట్టుకుని, జిల్లా పరిధిలో గల అధ్యయన కేంద్రాలను సంప్రదించి telanganaopenschool. org వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తును పూరించాలి. డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్, మీసేవా, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ప్రవేశ రుసుమును చెల్లించాలి. అపరాద రుసుముగా ఎస్సెస్సీకి రూ. 100, ఇంటర్‌కు రూ. 200లను చెల్లించాలని వారు తెలిపారు.
వైసీపీ నేతలు చెబితేనే కార్యాలయాల్లో పనులు: చంద్రబాబు