telugu navyamedia
సినిమా వార్తలు

మైక్‌ టైసన్‌ బర్త్‌డే : “లైగర్” టీం స్సెష‌ల్‌ విషెష్..

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “లైగర్”. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేకర్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసి రీసెంట్ గానే లాస్ట్ సాంగ్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు.

Mike Tyson to make his Bollywood debut in the Vijay Deverakonda and Ananya Panday starrer Liger

అయితే ఈసినిమాలో ప్రపంచ దిగ్గజ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే నేడు మైక్‌ టైసన్‌ బర్త్‌డే సందర్భంగా లైగర్‌ టీం ఓ స్పెషల్‌ వీడియోను వీడియోతో తనకి విసెష్‌ని తెలియజేసారు.

Liger: Ananya Panday, Vijay Deverakonda pose with Mike Tyson on Liger sets

మొదటగా సినిమా నిర్మాత కరణ్ జోహార్ నుంచి విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే సహా ఛార్మీలు కూడా మైక్ కి స్పెషల్ విషెష్ ని తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా మిమ్మల్ని చూసి గర్విస్తుంది మైక్‌ టైసన్‌, హ్యాపీ బర్త్‌డే అంటూ కరణ్‌ ఆయనను కొడియాడాడు.అలాగే ఆన్ సెట్స్ లో మైక్ తో కలిసి ఉన్న కొన్ని వీడియో షాట్స్ కూడా చూపించడం మరింత ఆసక్తిగా మారింది.

Liger Team With The Legendary Mike Tyson | Mike Tyson Galleries & HD Images

ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రేక్షకులను, మైక్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అగస్ట్‌ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో లైగర్‌ థియేటర్లలో అలరించనుంది.

Related posts