telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పుష్పా సినిమాలో విలన్ అతడేనా..?

Arya

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్పా. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని తెగ కష్టపడిపోతున్నారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మెస్తోంది. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా మందన్న బన్నీ సరసన నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు విలన్ దొరకలేదు. ఈ సినిమాలో విలన్ కోసం చిత్రం బృందం గాలింపులు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో విలన్ పాత్రకు ముందుగా తమిళ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారట, అతడు అందుబాటులో లేకపోవడంతో అతడిపై ఆశలు వదిలేశారు. దాని తరువాత విలన్ కోసం జల్లెడ వేస్తున్న సుకుమార్‌ ఇటీవల ఆర్యాను సంప్రదించాడట. ఆర్యా, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఇంతకుముందు వరుడు సినిమాలో కనపించారు. మళ్లీ ఇందులో కనిపిస్తారేమో చూడాలి. పుష్ప సినిమాలో విలన్ పాత్రలో ఆర్యా చేయడం పక్కా అయితే ఈ సినిమా యాక్షనే మరో రేంజ్‌కు చేరుకుంటుంది. ఈ సినిమాలో ఆర్యా కొత్త గెటప్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య చిత్ర యూనిట్‌లో ఒకరికి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిన సంగతి తెలిసందే. అతి త్వరలో తిరిగి చిత్రీకరణ మొదలు కానుందని సమాచారం.

Related posts