telugu navyamedia
సినిమా వార్తలు

“స్టూడెంట్ అఫ్ ది ఇయర్-2” ట్రైలర్

Student-of-the-year-2

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పునీత్ మల్హోత్ర దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2” సినిమా రూపొందింది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో కాలేజ్ క్యాంపస్ లో జరిగే గొడవలు, ప్రేమలు, సవాళ్లు, ఆటలు, పాటలు అన్నిటినీ యూత్ కు కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమా భారీ హిట్ తో పాటు భారీ భాసూళ్లను కూడా అందుకుంటుందేమో అన్పిస్తోంది. మే 10న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. గత కొంతకాలం వచ్చిన “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” చిత్రానికి ఇది సీక్వెల్ గా వస్తోంది. “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2”. “స్టూడెంట్ అఫ్ ది ఇయర్” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మరి “స్టూడెంట్ అఫ్ ది ఇయర్-2” చిత్రం ఎలా ఉండబోతుందో చూడాల్సిందే. “స్టూడెంట్ అఫ్ ది ఇయర్” ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts