telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉగ్రవాద శిబిరాలపై .. బాంబుల వర్షం కురిపించిన .. అమెరికా ..

america air force bombs attack on isis in iran

అమెరికా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం నేర్పింది. దాదాపు 36 వేల కేజీల బాంబులను యుఎస్ వైమానిక దళం ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ శిబిరాల పైన విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికానే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఎఫ్-15 మరియు ఎఫ్-35 జెట్లను కానస్ దీవి పైన బాంబులు వేసేందుకు ఉపయోగించారు. ఈ దీవి టిగ్రిస్ నది మధ్య మోసుల్ అనే ప్రాంతానికి 50 మైళ్ల దూరంలో ఉంది. అక్కడే ఐఎస్ఐఎస్ తన రహస్య శిబిరాలను ఏర్పరచుకుంది. అమెరికన్లు జెట్ విమానాల సహాయంతో బాంబులు వేసిన తర్వాత ఇరాక్ కు చెందిన స్పెషల్ ఫోర్స్ ను లోనికి పంపి మిగిలిన జిహాదీ ఉగ్రవాదులను హతమార్చారు. దాదాపు ఆ ప్రాంతంలో 40 టన్నులకి పైగా పేలుడు పదార్థాలను వాడినట్లు అమెరికా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.

వారు మనిషులను చంపుతున్నా కూడా, చస్తున్నది ఐఎస్ఐఎస్ కు చెందిన వారు కావడం వల్ల ఆ వీడియో చాలా చూడముచ్చటగా ఉంది అనే చెప్పాలి. అమెరికన్ మిలటరీ చెబుతున్న దాని ప్రకారం తీవ్రవాదులు ఆ దీవిని ఎప్పటినుంచో తమ రహస్య స్థావరంగా ఉపయోగించుకుంటూ ఎన్నో దాడులకు సన్నాహలు జరుపుతున్నారట. కొద్దిసేపటి క్రితమే కల్నల్ మైల్స్ బి క్యాగిన్స్ ఈ ఆపరేషన్ వీడియోని విడుదల చేస్తూ ఈ విధంగా ట్వీట్ వేశాడు. “అమెరికా వైమానిక దళం ఎఫ్-15 మరియు ఎఫ్-35 జెట్ల నుండి డేష్ సోకిన దీవిపై 36,000 కిలోల బాంబులు వేస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి” అని ఆ ట్విట్ లో ఉంది. డేష్ అనగా ఐఎస్ఐఎస్ ప్రకారం ఒక అమర్యాదకరమైన అరబిక్ పదం. ఏదేమైనా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అమెరికా కోలుకోలేని దెబ్బ తీసింది. దీనికి వారి సమాధానం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related posts