telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హిందువునని చెప్పుకోవడానికి సీఎం సిగ్గు ఉండాలి

టీఆర్‌ఎస్‌ పార్టీపై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ గడ్డ మీద బీజేపీ వంద సీట్లు గెలువబోతుందని.. గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు పాస్ పోర్ట్ బ్రోకర్ మన ముఖ్యమంత్రి అని…దుబ్బాక ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారని ఫైర్‌ అయ్యారు. సీఎం నిజంగా బీసీ పక్షపాతి అయితే పార్టీ అధ్యక్షుడుగా బీసీని చేయాలని అన్నారు. బీసీ మంత్రులు ముఖ్యమంత్రికి చెంచాగిరి చేస్తున్నారని…బీసీ సమస్యలను పక్కన పెట్టారని మండిపడ్డారు. 50 డివిజన్ లలో హిందు బీసీలు గెలవాల్సిన చోట 22 స్థానాల్లో ముస్లింలు గెలిచారని.. బీసీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని ఫైర్‌ అయ్యారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తాడట… ఇక ఒక్క సీటు కూడా బీసీకి ఉండదని తెలిపారు. బీసీ కుల వృత్తులు ముస్లింలు కబ్జా చేసారని…మైనార్టీ సంతుష్టికరణ కోసం హిందువుల పొట్ట కొడితే సహించమని హెచ్చరించారు. హిందు వ్యతిరేక విధానాలను బీజేపీ అడ్డుకొని తీరుతుందన్నారు. అగ్ర వర్ణ పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే సీఎం ఇక్కడ అమలు చేయడం లేదని మండిపడ్డారు.15 నిమిషాలు ఇస్తే హిందువులు లేకుండా చేస్తానని చెప్పిన పార్టీతో ఈ సీఎం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Related posts