telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

హిందూ మహాసముద్రంలో పడిన చైనా రాకెట్…

drdo successfully tested another missile

ఏప్రిల్ 29న భూమి నుంచి బయలుదేరి… చైనా స్పేస్ స్టేషన్‌ తియాన్హే (Tianhe)కి చెందిన కోర్ మాడ్యూల్‌ని మోసుకెళ్లిన లాంగ్ మార్చ్ 5B రాకెట్… గతి తప్పింది. ఇవాళ అది భూమిపై కూలిపోయింది.  అంతరిక్ష కేంద్రంలోని కొర్ మాడ్యులోకి విజయవంతంగా ప్రవేశించిన తరువాత ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది.  అప్పటి నుంచి ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది.  భూమిపై ఏ ప్రాంతంలో ఈ రాకెట్ కూలిపోతుందో అని భయపడ్డారు.  ఈరోజు ఉదయం ఈ రాకెట్  భూ వాతావరణంలోకి  ప్రవేశించిన తరువాత మండిపోయింది.  దాని శకలాలు జనావాసాలపై కాకుండా హిందూ మహా సముద్రంలో పడిపోయాయి. దీనికి సంబంధించి చైనా అధికారిక మీడియా పీపుల్స్ డైలీ ఓ ప్రకటన ట్వీట్ ద్వారా తెలిపింది. దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ  నెటిజన్లు మాత్రం చేపలు చచ్చిపోయి ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు. గతేడాది కరోనాను ప్రపంచంపై వదిలిన చైనా… ఈసారి రాకెట్‌ని వదిలిందని కామెంట్లు రాస్తున్నారు.

Related posts