telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆనంద‌య్యను మళ్ళీ తరలించిన పోలీసులు…

ఆనంద‌య్య‌ను నిన్న కృష్ణ‌ప‌ట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మ‌ళ్లీ అజ్ఞాతంలోకి త‌ర‌లించారు.. అయితే, వారం రోజుల త‌ర్వాత త‌న ఇంటికి వ‌చ్చిన ఆనంద‌య్య‌.. తాను ఎక్క‌డికీ పోన‌ని ఇక్క‌డే ఉంటాన‌ని చెప్పారు.. కానీ, కృష్ణపట్నంలో రాత్రి హై డ్రామా నెల‌కొంది.. ఆనందయ్య‌కు భద్రత దృష్ట్యా అజ్ఞాతంలోకి త‌ర‌లించాల‌ని పోలీసులు భావించ‌గా.. నిరాకరించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.. ఆనందయ్యకి భధ్రత కల్పిస్తూన్నారా? లేక కస్టడిలోకి తీసుకుంటున్నారా? అని గ్రామ ప్ర‌జ‌లు నిల‌దీశారు.. దీంతో.. రాత్రి వెన‌క్కి త‌గ్గిన పోలీసులు.. ఉదయం 5 గంటలకు మ‌ళ్లీ అజ్ఞాతంలోకి త‌ర‌లించారు.. ఈసారి ఆనంద‌య్య భార్య‌ను కూడా తీసుకెళ్లారు.. కాగా, ఇవాళ ఆనంద‌య్య మందుపై తుది నివేదిక వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే అధికారులు తెలిపారు.. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే.. సోమ‌వారం మందు పంపిణీకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

Related posts