మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటన చాలా బాధాకరమన్నారు. అబ్దుల్ సలాం ఆత్మహత్యపై సీఎం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. ఈ ఘటనలో ఎవరిని ఉపేక్షించొద్దని డిజిపికి సీఎం ఆదేశించారని…మానవతా కోణంలో సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అబ్దుల్ సలాం ఘటనను చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటున్నారని..రాజకీయాలు అంటే విలువలు దిగజారడం అని చంద్రబాబును చూస్తే అర్థం అవుతుందన్నారు. అబ్దుల్ సలాం ఆత్మహత్యలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని…ఆత్మహత్య ఘటనలో నిందితులకు బెయిల్ ఇప్పించిందని అచ్చెన్నాయుడు, చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే అడ్వకేట్ రామ చంద్రరావు అబ్దుల్ సలాం ఆత్మహత్య నిందితులకు బెయిల్ వచ్చేలా చేసారు..? అని.. అడ్వకేట్ రామ చంద్రరావును చంద్రబాబే పంపించారని ఆరోపించారు. నిందితులకు బెయిల్ వస్తే ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లకుండా రాజకీయాల కోసం ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని…రామచంద్రరావుది అడ్వకేట్ వృత్తి అయితే ఆయనకు విలువలు లేవా..? అని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని..చిన్న చిన్న ఘటనలు జరిగితే వాటిని అడ్డం పెట్టుకొని టీడీపీ రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. టిడ్కో ఇళ్లను బాధితులకు అందిస్తామని…బ్బులు చెల్లించిన వారికి త్వరలోనే ఉచితంగా ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. 365,430,గజాల ఇళ్ళను లబ్ధిదారులపై భారం పడకుండా తక్కువ చెల్లించేలా కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
previous post