telugu navyamedia
ఆరోగ్యం రాజకీయ వార్తలు

తిమ్మిర్లు వస్తున్నాయా.. అయితే ఆ ప్రమాదం తప్పదా ?

శరీరం తిమ్మిరిగా ఉందా? జాగ్రత్త.. ఈ ముప్పు పొంచివుంది. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు రూపంలో సంకేతాలిస్తుంది. ఒక్కోసారి ఆ చోట స్పర్శ కూడా తెలీదు. ఈ పరిస్థితినే ‘న్యూరోపతీ’ అంటారు. అయితే, తిమ్మిర్లు అన్నీ ఒకే రకమైనవిగా భావించకూడదు. వీటిలో కూడా తేడాలు ఉంటాయి. ఎక్కువ సేపు కదలకుండా కుర్చున్నప్పుడు సూదులతో గుచ్చుతున్నట్లుగా ఉండటం, మంటలు ఏర్పడటాన్ని పాజిటీవ్ తిమ్మిర్లుగా పేర్కొంటారు. నెగటివ్ తిమ్మిర్లు దీర్ఘకాలికంగా వేధిస్తాయి. ఇవి ఎక్కువ నొప్పి పెడతాయి. ఈ తిమ్మిర్ల వల్ల స్పర్శ కూడా కోల్పోతారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు నెగటివ్ తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటిని ‘ప్రెషర్ పాల్సీస్’ అని కూడా ఉంటారు. ఇలాంటి న్యూరోపతీ సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
#డయబెటీస్రోగుల్లోనేఎక్కువ:

మధుమేహం (డయబెటీస్) రోగుల్లో ఎక్కువగా తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. వీరు నిత్యం అరికాళ్ల మంటలతో బాధపడతారు. నడవకపోయినా సరే.. కార్లు చివ్వుమని నొప్పి పెడతుంటాయి. సూదులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది. ఈ తిమ్మిర్లు ఒక్కసారి నరకాన్ని చూపిస్తాయి. తిమ్మిర్లు ఎక్కువైతే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. మధుమేహం ప్రారంభంలో ఈ తిమ్మిర్లు కాళ్లకే పరిమితమవుతాయి. వ్యాధి ముదిరేకొద్ది తిమ్మిర్లు అన్ని అవయవాలకు పాకేస్తాయి. శరీరం మొత్తం మంటగా అనిపిస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. డయబెటిక్ చికిత్సకు ఇచ్చే ఇన్సులిన్‌ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. దీన్నే ‘ఇన్సులిన్‌ న్యూరైటిస్‌’ అంటారు. మధుమేహం వల్ల శరీరంలో ఉండే పొడవైన నరమే ముందుగా ఎఫెక్ట్‌ అవుతుంది. ఈ నరాలు కాళ్లలో ఉంటాయి. దీంతో మధుమేహం ఎటాక్ చేయగానే తిమ్మిర్లు కాళ్ళలోనే మొదలవుతాయి. మధుమేహం ఉందని తెలుసుకొనేసరికే శరీరంలోని 20 పైగా నరాలు దెబ్బతిని ఉంటాయట.

#తిమ్మిర్లనువస్తేఏం_చేయాలి?:
తిమ్మిర్లు ఎక్కువ రోజులు వేధిస్తుంటే.. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. తిమ్మిర్లు మీ శరీరంలో తీవ్రమైన అనారోగ్యానికి సంకేతాలని గుర్తించాలి. అయితే, ఈ తిమ్మిర్లు చాలా వ్యాధులతో ముడిపడి ఉంటాయి. అందుకే వైద్యులు ముందుగా రోగికి థైరాయిడ్, డయబెటీస్, విటమిన్ డెఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ‘నర్వ్ కండక్షన్’ ద్వారా తిమ్మిర్లను అంచనా వేస్తారు. ఒక వేళ మీ నోట్లో పుండ్లు (మౌత్ అల్సర్), కీళ్ల నొప్పుల్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ‘కనెక్టివ్ టిష్యూ డిజార్డర్‌‌’గా భావిస్తారు. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే మెదడు సంబంధ సమస్యలుగా గుర్తించాలి.

#తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే? #ఏం_చేయాలి?:
❂ శరీరాన్ని ఎక్కువ సేపు కదల్చనప్పుడే తిమ్మిర్లనేవి ఏర్పడుతుంటాయి. తిమ్మిర్లు తగ్గించుకోడానికి వ్యాయమం, యోగా ఒక్కటే సరైన మందు.
❂ లాక్‌డౌన్ వల్ల వర్క్‌ ఫ్రం హోమ్ చేస్తున్నవారు తప్పకుండా ప్రతి గంటకు ఒకసారి లేచి ఐదు నుంచి పది నిమిషాలు నడవాలి.

❂ ఎక్కువ దూరాలు ప్రయాణించేవారు లేదా వాహనాలను నడిపేవారు కనీసం రెండు గంటలకు ఒకసారైన విశ్రాంతి తీసుకోవాలి. వాహనం దిగి కాసేపు నడవాలి.
❂ ఎక్కువ సేపు టైప్ చేసేవాళ్లు, కంప్యూటర్లలో డాక్యుమెంటేషన్ చేసేవాళ్లు.. వేళ్లకు అప్పుడప్పుడు విశ్రాంతినివ్వాలి. లేదా వేళ్లకు ప్యాడ్స్ వంటివి ధరించైనా పని చేయాలి.
❂ ఎక్కువ బిగుతుగా ఉండే షూ లేదా చెప్పులు ధరించినా తిమ్మిర్లు పుడతాయి. నరాలు ఒత్తిడికి లోనవుతాయి. కాబట్టి.. వీలైనంత వదులైన షూలే వేసుకోండి.
#చేతులుకాళ్ళుతిమ్మిర్లుకుపరిష్కారం:

ఇది వయసుతో నిమిత్తం లేకుండా అందరిలో కనిపించే ఓక సాధారణమైన లక్షణం, కొందరిలో ఇది చాలా కాలం పాటు బాధిస్తుంది, దీనిని ఆయుర్వేదశాస్త్రంలో “సుప్తి వాతం” అంటారు,సుప్తి అనగా నిద్ర…

#తిమ్మిర్లుకుగల_కారణాలు:

అతి చల్లని వాతావరణం లేదా చల్లని పదార్దాలు తిన్నా, అధికబరువు, నరాలుకు దెబ్బ తగిలినా ప్రధానంగా మెడ , నడుముకు సంబందించి నరాలు, ఎక్కువసేపు కూర్చున్నా, బ్రెయిన్ ట్యూమర్, స్పైనల్ ట్యూమర్ లేదా స్ట్రోక్ వున్నా తిమ్మిర్లు సంభవించవచ్చు.

#తిమ్మిర్లువచ్చాకచేయల్సీనవి:
ముందుగా కొంచెం అదుముతూ రక్త సరఫరాను పెంచాలి, తిమ్మిరి బాగం నకు వేడి తాపనం చేయాలి, కాళ్ల తిమ్మిర్లు కొంచెం సేపు నడవాలి, గర్భస్థ స్త్రీలు కు తిమ్మిర్లు సాధారణం కావున కొంచెం అటూ ఇటుగా పొజిషన్ మారుస్తూ నిద్రపోవాలి.

Related posts