telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానం ప్రమాదవశాత్తు రోడ్డుపై క్రాష్ ల్యాండ్… వీడియో

Plane

తెహ్రాన్, కాస్పియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ విమానం ప్రమాదవశాత్తు రోడ్డుపై క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియనప్పటికీ.. ఆ విమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలోని దృశ్యాల ప్రకారం.. కాస్పియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం రోడ్డుపై క్రాష్ ల్యాండ్ కావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులంతా విమానంలోంచి సురక్షితంగా దిగుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. విమానం క్రాష్ ల్యాండ్ అవ్వడంతో వెంటనే స్పందించిన అధికారులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఎయిర్‌లైన్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు.


Video Credti :Noticias Cúcuta

Related posts