వీఐపీ బ్రేక్ దర్శనాల విభజనను రద్దు చేయాలని టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించాల్సివుందని గతంలో పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని చెప్పిన ఆయన, త్వరలో ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిగా ఏర్పడిన తరువాత తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బ్రేక్ దర్శనం టికెట్లు మూడు కేటగిరీల్లో విభజిస్తున్న సంగతి తెలిసిందే. స్థాయిని బట్టి వీటిని మంజూరు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. వీరిలో ఎల్1 టికెట్ ఉంటే, ఒత్తిడి లేకుండా స్వామివారి దర్శనం, ఆపై తీర్థం, శఠారీ మర్యాదలు, ఎల్2 టికెట్ ఉంటే, గర్భగుడి ముందు ద్వారమైన కులశేఖరపడి వరకు, ఎల్3 ఉంటే, వేగంగా కదిలేలా కూలైన్లను పర్యవేక్షిస్తూ, దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంతోకాలంగా విమర్శలు వస్తుండటంతోనే విధానాన్ని మార్చాలని వైవీ నిర్ణయించారు.