telugu navyamedia
వార్తలు సామాజిక

వ్యాక్సిన్‌ రేసులో జాన్సన్ అండ్ జాన్సన్!

Corona Virus Vaccine

కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ది కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలో వ్యాక్సిన్‌ ప్రయోగాల ట్రాయల్స్ కొనసాగుతున్నాయి. రష్యా ఇప్పటికే ఓ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ రేసులో చేరింది. ఒకే ఒక్క డోసుతో కరోనాను అంతమొందించేంత సామర్థ్యం కలిగిన టీకాను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల్లో ఉండగా, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60 వేల మంది వలంటీర్లకు ఈ టీకా ఇవ్వనున్నారు. మంచి ఫలితం రావాలంటే ఏదైనా టీకాను కనీసం రెండుసార్లు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ను తాము అభివృద్ధి చేసినట్టు జాన్సన్ అండన్ జాన్సన్ అధికారి ఒకరు తెలిపారు.

Related posts