telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రూ.46,535 పెండింగ్ చలాన్లు

srinivas goud minister

తెలంగాణ ఎక్సైజ్ శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోంది. 2016 నుంచి ఆయనపై చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టు ఈ-చలాన్ వెబ్‌సైట్ చూపిస్తోంది. ఆయనపై మొత్తం రూ.46,535విలువ గల 41 పెండింగ్ చలాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో చాలా వరకు అధికవేగం, ప్రమాదకర డ్రైవింగ్, కారుకు నల్లరంగు అద్దాలు కలిగి ఉండడం, నో పార్కింగ్ జోన్‌లో కారు పార్కింగ్ కేయడం వంటివి ఉన్నాయి. తాజాగా మే 21న కూడా ఆయనపై చలాన్ జారీ అయింది.

మరోవైపు హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్‌ పైనా 6,210 రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీకే ఝా ప్రభుత్వ వాహనంపై రూ.11,995 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పరిమితికి మించిన వేగానికి సంబంధించిన చలాన్లు ఉండడం గమనార్హం.

Related posts