telugu navyamedia
రాజకీయ

ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం..

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమేంటన్న దానిపై పలు రకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్ర‌మాద జరిగిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది నారింజ రంగులో ఉంటుంది. హెలికాప్టర్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయో బ్లాక్‌ బాక్స్‌లో రికార్డైన సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు.

The chopper went up in flames after it crashed in Coonoor on Wednesday. (ANI)

హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో ఏం జరిగింది..? ఆర్మీ హెలికాఫ్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌కు అసలు కారణమేంటి.? దట్టమైన పొగమంచే కారణమా..? అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ప్రమాదానికి కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను ఘటనాస్థలంలో సేకరించింది ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్‌. డీకోడింగ్‌కు ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించే అవకాశముంది. ప్రమాద స్థలంలో బ్లాక్‌ బాక్స్‌తో పాటు మరో 3 ఇతర వస్తువులను సేకరించారు.

CDS General Bipin Rawat and 12 Others Die In Helicopter Crash in Tamil Nadu

అయితే అసలు ఆ బ్లాక్‌బాక్స్‌లో ఏముంది..? ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగింది..? పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు..? ప్రమాదం జరిగిన సమయంలో ATCతో కాంటాక్ట్‌ అయ్యే ప్రయత్నం చేశారా..? అసలేం జరిగిందన్నది ఆ బ్లాక్‌ బాక్స్‌ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు అధికారులు. ఆ బ్లాక్‌ బాక్స్‌ను డీకోడింగ్‌ చేస్తే ప్రమాదానికి అసలు కారణమేంటన్న అంశంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం క‌న‌పిస్తుంది.

IAF chopper crash: Black box of chopper that crashed with CDS Gen Bipin Rawat on board recovered - India News

మ‌రోవైపు.. IAF చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి కూనూర్‌లో హెలికాఫ్టర్‌ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి ఆ ప్రాంతాలను పరిశీలించారు. తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్​మెంట్ బృందం ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించారు.

Related posts