telugu navyamedia
వార్తలు సామాజిక

గ‌న్ లైసెన్స్‌ పొందాలంటే 10 మొక్కలు నాటాల్సిందే!

Plant green chalenge

ప‌ంజాబ్‌లో గ‌న్ లైసెన్స్‌ పొందాలంటే 10 మొక్కలు నాటాల్సిందే. రాష్ట్రంలోని పాటియాలా జిల్లా యంత్రాంగం కొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ప‌ది మొక్క‌లు నాటిన వారికే గ‌న్ లైసెన్స్ ఇస్తామ‌ని తెలిపింది. ‘ట్రీస్ ఫర్ గన్స్’ విధానం ప్రకారం పాటియాలా ప్ర‌జ‌లు తుపాకీ లైసెన్స్ పొందడానికి 10 మొక్కలను నాటాల‌ని డివిజ‌న‌ల్ క‌మిష‌న‌ర్ చందర్ గైండ్ చెప్పారు.

ప‌త్తి మినహా ఏవైనా చెట్లు నాట‌వ‌చ్చ‌ని తెలిపారు. ఒక నెల పాటు పెంచి, సంరక్షించిన‌ తర్వాత ఆ మొక్క‌ల‌తో క‌లిసి ఫోటో దిగి స‌మ‌ర్పించాల‌ని అన్నారు. ఆ త‌ర్వాతే తుపాకీ లైసెన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంద‌ని చెప్పారు. పాటియాలాలో ప‌చ్చ‌ద‌నాన్నిపెంచేందుకు ఈ విధానం ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

Related posts