telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పద్మభూషణ్ కు సోనూసూద్ ను సిఫారసు చేయాలి : నటుడు బ్రహ్మాజీ

Brahmaji

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న ఈ రియల్ హీరో సోనూసూద్ పుట్టిన రోజు జూలై 30న. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటూ దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభిస్తున్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. ఇక ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు. ఈరోజు సోనూసూద్ పుట్టినరోజు సందర్భంగా సోనూకు సినీ నటుడు బ్రహ్మాజీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. “మైడియర్ సోనూసూద్ హ్యాపీ బర్త్ డే. కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తూ నిజమైన హీరోలా నిలిచావు. నీ సేవలను ప్రభుత్వం గుర్తించాలని, పద్మభూషణ్ కు నిన్ను సిఫారసు చేయాలని కోరుకుంటున్నా. నిజంగా నీవు మహాత్ముడివి సోనూ’ అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.

Related posts