telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో అఖిల్ అక్కినేని ?

akhil

ప్రస్తుతం ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాకుండా వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుంది. కాబట్టి హాట్ సీన్లు ఉన్నా సెన్సార్‌ ఇబ్బందులు లేకుండా రిలీజ్ చేయొచ్చు. అక్కినేని యువ హీరో అఖిల్ సరైన సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరక్కేక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం… అఖిల్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఓ క్రేజీ హిందీ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర కోసం మేకర్స్ అఖిల్ ను సంప్రదించారట. ఈ సిరీస్ లో రాక్ స్టార్ పాత్రను ఆఫర్ చేశారట. అయితే అఖిల్ దీనికి అంగీకరించాడా లేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Related posts