telugu navyamedia
సినిమా వార్తలు

జయలలిత పాత్రలో కంగనా

Kangana-Ranauth

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఓ భారీ చిత్రం తెరకెక్కబోతోంది. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత వేసిన ముద్ర వేసిన రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో భారీగా తెరకెక్కనున్న జయలలిత బయోపిక్ కు తమిళంలో “తలైవి”గా, హిందీలో “జయ”గా టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించనుంది. ఈరోజు కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు విష్ణు ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బాహుబలి, మణికర్ణిక వంటి అద్భుతమైన చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కథను అందించడం విశేషం. జీవీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మదన్ కార్వీ పాటల రచయితగా పని చేస్తున్నారు.

Related posts