telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్. నువ్వు బాగుండాలబ్బా… : మెగాస్టార్

Aa

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వెండితెర అరంగేట్రం చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. డ్యాన్స్‌ల్లోనూ, నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఈ రోజు (బుధవారం) బన్నీ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు బన్నీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్ ద్వారా బన్నీకి విషెస్ చెప్పారు. బన్నీ చిన్ననాటి ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. `బన్నీ డ్యాన్స్‌లో గ్రేస్ ఆ వయస్సు నుంచే ఉంది. బన్నీలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్. నువ్వు బాగుండాలబ్బా` అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Related posts