telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆఫీస్ బాయ్‌కి ఎక్కువ యాంకర్‌కి తక్కువ అన్నట్లు చూసారు : నటి అనిత చౌదరి

anita

యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అనితా చౌదరి. తన పేరు వెనక చౌదరి అని ఉన్నా తనకు బెనిఫిట్ ఏమీ లేదని వాపోయారు. యాంకరింగ్ చేస్తున్నప్పుడు తన చేత కుక్క చాకిరీ చేయించుకున్నారని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇండస్ట్రీలో చౌదరిలకే అవకాశాలు ఇస్తారు అనడంలో వాస్తవం లేదు. నా పేరు అనితా చౌదరి. కానీ నా చేత కుక్క చాకిరీ చేయించుకున్నారు. ఆఫీస్ బాయ్‌కి ఎక్కువ యాంకర్‌కి తక్కువ అన్నట్లు చూసారు నన్ను. నేను ఈటీవీలో ఓ ప్రోగ్రామ్ చేస్తుంటే నా పేరును అనితా చౌదరిగా వేసేసారు. నేను చౌదరి అన్న పేరు తీసేయమని చెప్పాను. కానీ వాళ్లు వినిపించుకోలేదు. ఫర్వాలేదులెండి ఎటూ వేసేసాంగా తీయడం ఎందుకు అన్నారు. అదీకాకుండా అప్పట్లో అనిత పేరుతో చాలా మంది ఉన్నారు. దాంతో అనితా చౌదరి అనే ఉంచేసుకున్నాను. కులం వల్ల మగవాళ్లకు లాభం కలిగిందేమో కానీ మాకు మాత్రం కులం వల్ల ఎలాంటి లాభాలు జరగలేదు అని వాపోయారు.

Related posts