telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సైఫ్ కొత్త లుక్.. ఆదిపురుష్ కోసమేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఒకవైపు ప్రశాంత్ నీల్‌ సలార్, మరోవైపు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాలను చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో సైఫ్ రావణుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తానాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ రాముడుగా కనిపించనుండగా.. ఇటీవలే సీత పాత్రలో కృతిసనన్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రాముని సోదరుడు లక్ష్మణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం సైఫ్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించాడు. అయితే సైఫ్ తాజాగా న్యూ హెయిర్ కట్ లుక్ తో పాటు కాంటాక్ట్ బ్లూ లెన్సెస్ ధరించి కనిపించాడు. తాజా లుక్ లో సైఫ్ ను చూస్తుంటే.. ఈ విధంగానే రావణ్ క్యారెక్టర్ లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైఫ్ న్యూ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది 2022 ఆగస్టు 11న ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Related posts