ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంతవరకూ పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలకు చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఫై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అక్రమంగా తనను ఇరికించారంటూ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో రవిప్రకాశ్ పేర్కొన్నట్టు సమాచారం. రవిప్రకాశ్ తరపున న్యాయవాది అహ్లువాలియా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
చంద్రబాబు వల్లే తెలంగాణ ఉద్యమం: మంత్రి అవంతి