telugu navyamedia
సినిమా వార్తలు

సెల్ఫీల కోసం హీరోయిన్ ను ఇబ్బంది పెట్టిన అభిమానులు…

malaika-arora-khan

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే ముందుగా వారి అభిమానులు చేసే పని వారితో సెల్ఫీలు దిగాలనుకోవడం. కానీ ఆ ఆలోచన కాస్త మితిమీరడంతో సెలబ్రిటీలు అభిమానులపై చికాకు పడుతుంటారు. తాజాగా నటి మలైకా అరోరా ఆమె తన తండ్రితో కలిసి ముంబైలో ఓ మాల్ కి వెళ్లింది. ఆమెని చూసిన అభిమానులు సెల్ఫీలంటూ వెంటపడ్డారు. కొందరితో ఫోటోలు దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించినా చాలా మంది చుట్టుముట్టడంతో ఆమె ఇబ్బంది పడింది. ఆమె తండ్రి అభిమానులను దూరంగా ఉండమని చెబుతున్నా వారు పట్టించుకోకపోవడంతో మలైకా వారి నుండి ఎలాగోలా తప్పించుకొని కారు ఎక్కివెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, జనాలు కాస్త హద్దుల్లో ఉండాలని మండిపడుతున్నారు.

Related posts