telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దేశాన్ని కాపాడే వీరులే… మన సైనికులు

చుట్టూతా మంచు
కనుచూపు మేరలో
కానరాని నేల
రక్తం గడ్డేలా ఉన్నా ఆలోచించక
కంటిమీదకి కునుకన్నదే రానీయక
దేశరక్షణ బాధ్యతే
తమ పరమావధిగా భావిస్తూ
పోరాటంలో ప్రాణాలు
పోతాయేమోనన్న ఆలోచనే రానీక
నరనరాన దేశభక్తి పొంగిపొర్లుతుండగా
దేశపు సరిహద్దుల్లోకి చొరబడాలని
చూసే దుండగులతో పోరాడుతూ
శరీరానికి అయిన గాయాలనుండి
రక్తం పారుతున్నా వెనుకడుగేయక
సరిహద్దుకు ఆవల ఉన్న
శత్రుమూకలను చీల్చిచెండాడి
దేశాన్ని కాపాడే వీరులే
మన సైనికులు
యుద్ధం లో పోరాడి
వీరమరణం పొందే
వీరులను తనలో కలుపుకుంటుంటే
పుడమితల్లి మేని పరవశంతో
పులకరించి పోతుందటా
అతడిని కన్నతల్లి
తన మరోబిడ్డని
సైన్యంలోకి పంపడానికి
ఉద్యుక్తురాలౌతందటా

Related posts