telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

తనివితీరా ఏడ్చుకొని .. వెళ్ళండి.. : ఏడుపుగొట్టు క్లబ్

crying club launched in hyderabad

మనం నిత్యజీవితంలో కావాల్సినంత తినకపోయినా, సరిపడా నవ్వాలి. అప్పుడే ఆరోగ్యం. లేదంటే మానసిక ఒత్తిడితో అనేక రోగాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నవ్వుకోడానికి క్లబ్ లు ఏర్పాటు అయ్యాయి. ఇక అందులోకి వెళ్లి కృత్రిమంగా అయినా కొంతసేపు నవ్వుకొని.. ఉపశమనం పొందుతున్న వాళ్ళు తయారయ్యారు. అయితే సంతోషం కలిగినప్పుడు నవ్వు దానంతట అదే వస్తుంది.. బాగానే ఉంది. మరి ఎప్పుడైనా బాధ కలిగితే, తనివితీరా ఏడవాలని అనిపిస్తుంది.. అప్పుడేం చేయాలి. ఏడుస్తుంటే ఎవరైనా చూస్తే బాగోదు.. మరేమి చేయాలి.. !

దానికీ ఒక క్లబ్ కొత్త పరిష్కారం తెచ్చింది. తమ క్లబ్ కి బాధలలో ఉన్నవారు రావచ్చంటూ, అలాగే తనివితీరా ఏడ్చుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే కాదు మీరు ఏడవటంలో కాస్త మొహమాటం పడుతున్నారంటే, వెంటనే ఎలా ఏడవాలో తర్ఫీదు కూడా ఇచ్చి, మీ బాధలను గుండెలోతుల నుండి బయటకు పంపించేస్తారు. తద్వారా ఎప్పటి నుండో గుండెలో గూడుకట్టుకుపోయిన బాధలు పోవటంతో చాలా విశ్రాంతిగా కూడా అనుభూతి పొందుతున్నారు.

crying club launched in hyderabadaప్రస్తుతం ఈ లాఫింగ్ క్లబ్ కు మంచి డిమాండ్ కూడా వచ్చేసింది. వచ్చి మీబాధలను పోగొట్టుకొని వెళ్ళండి అంటే ఎవరు మాత్రం ఆ అవకాశాన్ని వదులుకుంటారు. ఇక ఏడిస్తే, బేల అనుకుంటారేమో.. లేక మగ జన్మ ఎత్తాక ఏడిచే స్వాతంత్రం లేదనో.. ఇలా ఏదో ఒక కారణం చేత కనీసం బాధ కలిగినప్పుడు ఏడ్చే స్వేచ్ఛ లేని వారికి ఈ క్లబ్ భూతాల స్వర్గంలా అనిపిస్తుంది.

క్లబ్‌ చైర్మన్‌ ఏ.వి.సత్యనా రాయణ, బషీర్ బాగ్‌లోని దేశోద్ధారక భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏబిసి లాఫింగ్‌ క్లబ్‌’ ఆధ్వర్యంలో క్రైయింగ్‌ క్లబ్ ని కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ లోని గుజరాతీ సేవా మండల్, బల్దేవ్‌ హాల్‌లో ఈ క్లబ్ ని గుజరాత్ కు చెందిన లాఫింగ్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు కమలేష్‌ మసాలవాల ఈ ఏడుపుగొట్టు క్లబ్బును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మణ్‌, తదితరులు పాల్గొ న్నారు.

Related posts