telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

క్యాన్స‌ర్ కు .. ఇవీ కారణాలు… వీటికి దూరంగా ఉంటె సరి…

things to avoid to overcome cancer

క్యాన్స‌ర్ అనగానే వెన్నులో వణుకు వచ్చేంతగా భయబ్రాంతులకు గురికావటం జరుగుతుంది. ఎందుకంటె అది అంత ప్రాణాంతక వ్యాధి. ముందుగా తెలిస్తే సరి, లేదంటే మరణమే… అందుకే అదంటే అందరికి అంత భయం. అయితే ఇప్పటి కాలంలో ఇష్టానికి ఏదోటి తింటూ కాలక్షేపం చేస్తున్న వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు; ఇక క్యాన్స‌ర్ మహమ్మారి కూడా అంతే బలంగా ప్రబలుతోంది. దీనికి ప్రధాన కారణాలు కొన్ని కనుగొన్నారు వాటిని వీలైనంతవరకు దూరంగా ఉండగలిగితే.. మన జీవితంలో ఈ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అవేమిటో చూద్దాం..

1. మ‌ల‌బ‌ద్ద‌కం

మ‌న దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లోనూ ఇప్పుడు చాలా మంది మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఎవ‌రైనా ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యంగా వ‌దిలేయ‌రాదు. త‌గిన చికిత్స తీసుకోవాలి. లేదంటే.. క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. నిత్యం మ‌నం తినే ఆహారంలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకుంటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మస్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

2. అసిడిటీ

క్యాన్స‌ర్ వ‌చ్చిన చాలా మందిలో అసిడిటీ స‌మ‌స్య ప్ర‌ధాన అంశంగా మ‌న‌కు క‌నిపిస్తుంది. క‌నుక ఎవ‌రైనా అసిడిటీ ఉంటే దాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అసిడిటీ వ‌చ్చేందుకు ప్ర‌ధాన కార‌ణం.. నిద్ర‌పోయే ముందు భోజ‌నం ఎక్కువ‌గా తిన‌డం. లేదా భోజ‌నానికి, భోజ‌నానికి మధ్య ఎక్కువ స‌మ‌యం ఉండ‌డం, కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉండే ఆహారం తిన‌డం, జంక్‌, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటివ‌న్నీ అసిడిటీకి కార‌ణాలు అవుతాయి. క‌నుక ఇవ‌న్నీ మానేసి ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానం క‌లిగి ఉండాలి. నిత్యం ఒకే స‌మ‌యానికి వేళ త‌ప్ప‌కుండా ఆహారం తీసుకోవాలి. దీంతో అసిడిటీ రాకుండా ఉంటుంది. క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు.

3. నిద్ర

మ‌న‌లో చాలా మంది రాత్రిళ్లు అధిక స‌మ‌యం పాటు మేల్కొని ఉంటారు. అలాగే కొంద‌రు నైట్ డ్యూటీలు చేస్తుంటారు. ఈ వ‌ర్గానికి చెందిన వారికి నిద్ర స‌రిగ్గా ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరం వాపుల‌కు గుర‌వుతుంది. శ‌రీరం త‌న లోప‌ల ఉండే అవ‌య‌వాల‌కు స‌రిగ్గా మ‌ర‌మ్మ‌త్తులు చేసుకోలేదు. దీని వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు దెబ్బ తిని ఆ భాగంలో క్యాన్సర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కనుక నిత్యం స‌రైన స‌మ‌యానికి త‌గినన్ని గంట‌ల పాటు నిద్రించాలి.

4. ఎక్కువసేపు కూర్చుని ఉండ‌డం

దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇప్పుడు చాలా మంది ఈ త‌ర‌హా ఉద్యోగాల‌నే చేస్తున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుంటున్నారు. దీని వ‌ల్ల డ‌యాబెటిస్‌, హైబీపీ బారిన ప‌డుతున్నారు. ఇలాంటి వారు నిత్యం వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఆయా అనారోగ్య స‌మస్య‌లు రాకుండా చూసుకోవ‌డ‌మే కాదు, క్యాన్స‌ర్ నుంచి తప్పించుకోవ‌చ్చు. నిత్యం వాకింగ్ చేయ‌డం, యోగా, ధ్యానం చేస్తే ఫ‌లితం ఉంటుంది.

5. ఒత్తిడి

నేటి త‌రుణంలో చాలా మంది ఒత్తిడి బారిన ప‌డుతున్నారు. నిజానికి ఒత్తిడి ఆరోగ్యానికి హానిక‌రం. దీని వ‌ల్ల డ‌యాబెటిస్‌, థైరాయిడ్‌, గుండె జ‌బ్బులు, ఆందోళ‌న వ‌స్తుంటాయి. క‌నుక ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు మెడిటేష‌న్‌, యోగా, శ్వాస వ్యాయామాలు చేయాలి. దీంతో క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు.

Related posts