telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ధరణిపై తెలంగాణ సీఎస్‌ కీలక ఆదేశాలు జారీ..

ధరణికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు లు సంబంధిత అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించడంతో పాటు, క్లియర్‌ చేయడానికి పలు చర్యలు తీసుకున్నట్లు సమావేశంలో గుర్తించారు. ధరణిలోని పెండింగ్ మ్యుటేషన్ మాడ్యూల్ ద్వారా 74688 దరఖాస్తులు రాగా 62, 847లను కలెక్టర్లు పరిష్కరించారు. సంస్ధలకు, కంపెనీలకు పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయడానికి అవసరమైన మాడ్యూల్ ధరణిలో అందుబాటులో ఉంచడంతో పాటు NRI మాడ్యూల్ ను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. సంస్ధలు, కంపెనీల పేర రిజిష్ట్రేషన్ మాడ్యూల్ అభివృద్ధి దశలో ఉందని ఫిబ్రవరి, 15 నాటికి అందుబాటులోకి తేవడం జరుగుతుంది. జిల్లాలలో మాడ్యూల్ వినియోగంపై అధ్యయనం కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటుచేసి గ్రామాలలో పర్యటించాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ టీంలు మాడ్యూల్స్ అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి సలహాలు ఇస్తుందని… కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని.. ముఖ్యంగా పార్ట్-బి లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని సీఎస్ ఆదేశించారు.

Related posts