telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ దెబ్బకు సీఎం కేసీఆర్‌ మేల్కొన్నాడు..

బీజేపీ నాయకురాలు డీకే అరుణ మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రైతు వేదికల భవనాలపై కేసీఆర్ ఫోటోతో పాటు మోడీ చిత్ర పాఠం ఏర్పాటు చేయాలని… రాష్ట్రంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం నిధులు వున్నాయని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నదని… దుబ్బాక…జిఎచ్ఎంసి ఎన్నికల్లో పడ్డ దెబ్బతో కేసీఆర్ మేల్కొన్నాడని పేర్కొన్నారు. రాబోవు అన్ని ఎన్నికల్లో బీజేపీ హావ కొనసాగుతుందని.. కేంద్ర ప్రభుత్వ పథకాల అవసరం లేదని అన్న కేసీఆర్ నేడు యూ టర్న్ తీసుకుంటున్నాడని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు అన్నాడు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేసారు…మళ్ళి యూ టర్న్ తీసుకుని చట్టాలకు జై కొట్టాడని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ధరణి అన్నాడు…యూ టర్న్ తీసుకున్నాడని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను నాయకులు బెదిరిస్తే సహించేది లేదని…కేసులు..కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది టిఆర్ఎస్ పార్టీనే అని తెలిపారు. బీజేపీ కార్యకర్తలకు అండగా వుంటామని… ఎవరు భయపడాల్సిన అవసరం లేదని డీకే అరుణ హామీ ఇచ్చారు.

Related posts