telugu navyamedia
సినిమా వార్తలు

M.A.A నూతన అధ్యక్షుడు వీ.కే. నరేష్ కు గౌరవ డాక్టరేట్

Doctarate to MAA New President VK Naresh

తెలుగు చలన చిత్ర మూవీ ఆర్టిస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గ ఎన్నిక అయినా కధానాయకుడు Dr. వీ.కే. నరేష్ కు కాలిఫోర్నియా యూనివర్సిటీ అఫ్ బెర్కెలీ వారికి అఫిలియేట్ అయినా  యునైటెడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం జేశారు . మారియట్ స్టార్ హోటల్ లో జరిగిన ఈ వేడుకల్లో ఛాన్సలర్ ఆర్చ్ బిషప్ Dr. ఫ్రెడ్రిక్ ఫ్రాన్సిస్  Dr. వీ.కే. నరేష్ కు, హీరో సుమన్ , ప్రముఖ వైద్యులు గురువా రెడ్డి, జంగారెడ్డి గూడెం వ్యాపారవేత్త రాజన్ సత్యనారాయణ మరియు  తదితర వివిధ రంగాలలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించిన వారికి గౌరవ డాక్టరేట్ అందజేశారు .

 

ఈ సందర్బంగా ప . గో . జిల్లా జంగారెడ్డి గూడెం   సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళి కృష్ణ , అమ్మ చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్ చిటికెల రాంబాబు , P.R.O బాలాజీ శర్మ , గౌరవ డాక్టరేట్ పొందిన Dr. వీ.కే. నరేష్ మరియు జంగారెడ్డి గూడెం కి చెందిన సోషల్ సర్వీస్ లో గౌరవ డాక్టరేట్  పొందిన  మిత్రులు , వ్యాపార వేత్త రాజన్ సత్యనారాయణ ల ను అభినందిస్తూ మొమెంటో అందజేశారు

Related posts