telugu navyamedia
సినిమా వార్తలు

కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో శర్వానంద్

Sharwanand images

“పడి పడి లేచే మనసు” చిత్రం నిరాశపరిచినప్పటికీ ప్రస్తుతం శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుధీర్ వర్మతో శర్వానంద్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తరువాత కొత్త దర్శకులతో చేయనుండడం విశేషంగా మారింది.తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దాదాపు పదకొండేళ్ల క్రితం “నీవల్లే ..నీవల్లే” చిత్రానికి దర్శకత్వం వహించిన సుందరం ఇంతకాలం నటుడుగా, కొరియోగ్రాఫర్ గా కొనసాగారు. అయితే ఇంతకాలం తరువాత సుందరం కథతో శర్వానంద్ దగ్గరకు వెళ్లడం, శర్వానంద్ కు ఆ పాయింట్ నచ్చటం, పూర్తి స్క్రిప్టుతో రమ్మనమనటం వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే ఈ చిత్రం విషయమే అఫీషియల్ ప్రకటన వస్తుంది. శర్వానంద్ తాజా ప్రాజెక్టుల విషయానికి వస్తే… సుధీర్‌వర్మ సినిమాతో పాటు శర్వానంద్ నటిస్తోన్న చిత్రం ’96’ తమిళ రీమేక్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్‌నే తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

Related posts