telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య కొత్త సినిమా కథ ఇదే…

Balakrishna

నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు నాడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ చిత్రకథ ఇదేనంటూ రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. చాలా మంది ఇదొక పొలిటికల్ డ్రామా అని, ప్రస్తుత రాజకీయాలకు ఈ చిత్రం అద్దం పడుతుందని పేర్కొంటున్నారు. మరికొందరు ఈ చిత్రంలో జగపతి బాబు పాత్ర ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను పోలి ఉంటుందని అంటున్నారు. అయితే తాజాగా ఈ రూమర్‌లపై చిత్ర నిర్మాత సి. స్పందించారు. ఈ వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఇదొక పూర్తి కమర్షియల్ చిత్రమని, ఈ చిత్రంలో బాలకృష్ణ ఒక పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నారని, ఇది ఏ వ్యక్తితో ముడిపడదని, ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రం కాదని, ఈ చిత్రంలో బాలయ్య విభిన్నమైన టు షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారని స్పష్టం చేశారు. ఒకటి పోలీసాఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర. ఒక నిజాయితీ, సిన్సియర్ పోలీసాఫీసర్.. గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులేంటనేదే ఈ చిత్ర కథాంశమని చెప్పారు.

Related posts