కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో మంచి విజయం సాధించింది. దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అన్ని ఇండస్ట్రీలని షాక్‌కి గురి చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో యశ్, సంజయ్ దత్, రవీన్ టాండన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో చిత్ర విడుదలకి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంకి సంబంధించి పలు ఫేక్ ఈమెయిల్స్ క్రియేట్ చేసి టాలెంట్ వ్యక్తులని కొందరు మోసం చేస్తున్నారు. ఇలాంటి మెయిల్స్ నమ్మి మోసపోవద్దు అని హెచ్చరిస్తున్నారు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ కి సంబంధించి ఎలాంటి ఆడిషన్స్ ఉన్నా కూడా హామ్‌బేల్ ఫిలింస్ నుండి మాత్రమే అఫీషియల్ ప్రకటన వస్తుందని స్పష్టం చేశారు ప్రశాంత్
previous post